Sunday, April 28, 2024

గ్రామాల్లో ప్రతి ఇల్లు ఆన్‌లైన్ కావాలి

- Advertisement -
- Advertisement -
Every house in villages needs to be online

 

గుడిసెలు, పూరిళ్లు సహా ప్రతి అంగుళం రికార్డు చేయాలి
వ్యవసాయ క్షేత్రాల్లోని నిర్మాణాలను గుర్తించాలి
ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించండి
చైతన్యం, అవగాహన పెంచండి
గ్రామాల్లో ఇళ్ల్ల ఉచిత ఆన్‌లైన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయదారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో గ్రామాల్లో ఇళ్లకు కూడా మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించిన నేపథ్యంలో ఆయా వివరాలతో కూడిన రికార్డులను పకడ్భందీగా తయారు చేయాలని ఉన్నతాధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటివ సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులతో మంత్రి హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా, వ్యవసాయ భూములకు మాదిరిగానే, గ్రామాల్లోని ఇళ్లు ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ, పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు. భూములకు భద్రత కల్పించడంతో పాటు, ఆయా భూములు, ఇళ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే సిఎం లక్ష్యమన్నారు. దీనికనుగుణంగా గ్రామాల్లోని ప్రతి ఇళ్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఇండ్లు, వగైరాలన్నీ ప్రతి అంగుళం రికార్డు చేయాలని అందుకు తగ్గట్లుగా, కింది స్థాయి వరకు ఆదేశాలు వెళ్లాలని మంత్రి సూచించారు. ఎలాంటి లోపాలు లేకుండా రికార్డు ప్రక్రియను ఓ ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో అనుమానాలు, అపోహలుంటే తొలగించాలని మంత్రి సూచించారు. దళారులు, ఇతరులెవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని, ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జరుగు తుందన్న విషయంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News