Saturday, April 27, 2024

2024లో చంద్రుని పైకి యుఎఇ మానవ రహిత వ్యోమనౌక ప్రయోగం..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: మానవ రహిత వ్యోమనౌకను 2024లో చంద్రుని పైకి పంపడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సన్నాహాలు చేస్తోంది. ఎమిరాటి ఉన్నతాధికారి మంగళవారం ఈ వివరాలు తెలియచేశారు. వేగంగా విస్తరించే ఈ అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి దుబాయి పాలక అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ పేరు పెడుతున్నారు. ఎమిరాటి అంతరిక్ష పరిశోధన సంస్థ గత ఏడాది అంగారక యాత్రలో భాగంగా మొదటి వ్యోమగామని అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపగలిగింది. ఇప్పుడు చేపట్టిన చంద్రయాత్ర లూనార్ రోవర్ ఇదివరకు చంద్రునిపై వ్యోమగాములు ఎవరూ పరిశోధించని ప్రాంతాలకు 2024లో చేరుతుందని షేక్ మొహమ్మద్ ట్విటర్ ద్వారా తెలియచేశారు. చంద్రుని ఉపరితలంపై ఎక్కడ పరిశోధనలు సాగిస్తారో రోవర్‌ను ఎలా ప్రయోగిస్తారో ఆ వివరాలు ఆయన తెలియచేయలేదు.

అంగారక వ్యోమనౌక ‘హోప్’ ప్రయోగం గత జులైలో జపాన్ టానెగషిమా స్పేస్ సెంటర్‌లో జరిగింది. ఇప్పుడు ప్రయోగించనున్న లూనార్ రోవర్ 10 కిలోల బరువు ఉంటుంది. అత్యంత ఎక్కువ రిసల్యూషన్ కెమెరాలు రెండిటితోపాటు, మైక్రోస్కోపిక్ కెమెరా, థెర్మల్ ఇమేజి కెమెరా, ప్రోబ్, ఇతర సాధనాలు రోవర్‌కు అమర్చి ఉంటాయి. 2024 ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై పరిశోధనలు చేపట్టే నాలుగో దేశంగా అరబ్ ఎమిరేట్స్ చరిత్ర కెక్కుతుంది.

UAE launch Unmanned spacecraft to Moon in 2024

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News