Sunday, April 28, 2024

యుపి బిజెపికే!

- Advertisement -
- Advertisement -

Exit polls revealed results of five state assembly elections

పి మార్క్

బిజెపి: 225 నుంచి 255, ఎస్‌పి: 130 155, బిఎస్‌పి: 1222, కాంగ్రెస్: 2 6, ఇతరులు: 4
మ్యాట్రిజ్
బిజెపి: 262 277, ఎస్‌పి: 119 134, బిఎస్‌పి: 7 15, కాంగ్రెస్: 38

ఆత్మసాక్షి

బిజెపి: 138 140, ఎస్‌పి: 235 240, బిఎస్‌పి: 1923, కాంగ్రెస్: 12 16 ఇతరులు: 1 2
సిఎన్‌ఎన్ న్యూస్ 18
బిజెపి: 240, ఎస్‌పి: 140, బిఎస్‌పి: 17, కాంగ్రెస్: 0, ఇతరులు: 6

పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్ పోటాపోటీ
గోవాలో బిజెపి, కాంగ్రెస్ హోరాహోరీ మణిపూర్‌లో బిజెపి

న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సోమవారం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంలో సోమవారమే తుది, ఏడవ దఫా పోలింగ్ ముగిసింది. దీనితో వివిధ సర్వే సంస్థలు సోమవారం సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు అధికారంలో ఉన్నభారతీయ జనతా పార్టీ (బిజెపి)యే తిరిగి అధికారంలోకి వస్తుం దని వివిధ ఎగ్జిట్ పోల్స్‌తో స్పష్టం అయింది. అయితే బిజెపికి ఈసారి సంఖ్యాబలం 300కు తక్కువగానే వస్తాయని ఇందులో వెల్లడైంది. రాజకీయంగా ప్రాధాన్యత గల పంజాబ్‌లో ఆ మ్ ఆద్మీపార్టీ (ఆప్) అత్యధిక స్థానాలను గె ల్చుకుంటుందని అధికారం దక్కించుకుంటుం దని కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇ క్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి గ ట్టి ఆప్ నుంచి ఎదురయిందని తేల్చారు. ఇక గోవా, ఉత్తరాఖండ్‌లలో హంగ్ అసెంబ్లీలు వస్తాయని, మణిపూర్‌లో బిజెపి అత్యధిక స్థానాలు గెల్చుకునే పార్టీ అవుతుందని వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లో బిజెపినే

మొత్తం స్థానాలు 403 ….బిజెపికి 232 స్థానాలు, సమాజ్‌వాదిపార్టీకి 150 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో వెల్లడైంది. . నాలుగు సంస్థల ఎగ్జిట్ పోల్స్‌తో వెలువడ్డ సగటు ఫలితాన్ని విశ్లేషించుకుంటే ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, మిత్రపక్షాలు 231 స్థానాలను దక్కించుకుంటాయి. ఇక్కడ మెజార్టీ స్థాపనకు అవసరం అయిన సంఖ్యాబలం 202. మొత్తం 403 స్థానాల యుపి అసెంబ్లీలో అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) 140 స్థానాలకు పైగా సాధించుకుంటుంది. యుపిలో పి మార్క్ ఎగ్జిట్ పోల్ మేరకు బిజెపికి 225 నుంచి 255, ఎస్‌పికి 130 155, బిఎస్‌పికి 1222, కాంగ్రెస్‌కు 2 6 ఇతరులకు 4 వరకూ వస్తాయి. ఇక్కడనే మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్‌లో బిజెపికి 262 277, ఎస్‌పికి 119 134, బిఎస్‌పికి 7 15, కాంగ్రెస్‌కు 38 వస్తాయని వెల్లడైంది. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్‌లో బిజెపికి 138 140, ఎస్‌పికి 235 నుంచి 240, బిఎస్‌పికి 1923, కాంగ్రెస్‌కు 12 నుంచి 16 ఇతరులకు 1 లేదా 2 స్థానాలు వస్తాయి. సిఎన్‌ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్‌లో బిజెపికి 240, ఎస్‌పికి 140, బిఎస్‌పికి 17, కాంగ్రెస్‌కు సున్నా ఇతరులకు 6 స్థానాలు వస్తాయని తేల్చారు.

కీలక పంజాబ్‌లో ఆప్ పాగా?

ఇప్పటివరకూ అధికారం హస్తగతం చేసుకుంటూ వస్తున్న పంజాబ్‌లో ఈసారి కేజ్రీవాల్ నాయకత్వపు ఆప్ అధికారంలోకి వస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో స్పష్టం అయింది. మొత్తం 117 స్థానాల పంజాబ్‌లో ఆప్ 68 స్థానాలను దక్కించుకుంటుంది. ఇక్కడ అధికార స్థాపనకు అవసరం అయిన సీట్ల సంఖ్య 59. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌లో ఇటీవలి అంతర్గత కలహాల పరిణామాలు ఈసారి ఎన్నికల ఫలితాలతో వెలుగులోకి వచ్చాయి. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలతో పార్టీ వీడి బిజెపితో జట్టు కట్టిన మాజీ సిఎం అమరీందర్ సింగ్ ప్రభావం కాంగ్రెస్‌పై పడింది. ఇక ఇక్కడ అధికార వ్యతిరేకతను ఆప్ తనకు అనుకూలంగా మల్చుకుంది. బిజెపి నాలుగో స్థానంలోనే నిలిచిందని వెల్లడైంది. అయితే పంజాబ్‌లో బిజెపి మాజీ మిత్రపక్షం అకాలీదళ్‌కు ఈసారి 18 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలలో వెల్లడైంది. ఆత్మసాక్షి సర్వేలో ఆప్ 34 38, కాంగ్రెస్ 5861, అకాలీదళ్ 18 21, బిజెపి 4 నుంచి 5 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడైంది. యాక్సిస్ మై ఇండియా సర్వేలో ఆప్ 76 90, కాంగ్రెస్ 1931, అకాలీదళ్ 711, బిజెపి 1 నుంచి 4 ఇతరులకు 2 స్థానాలు వస్తాయని స్పష్టం చేశారు. ఇండియా టుడే అంచనాలలో ఆప్ 76 90, కాంగ్రెస్ 1931, అకాలీదళ్ 711, బిజెపి 14, ఇతరులకు సున్నా నుంచి రెండు స్థానాలు వస్తాయని వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లో పోటాపోటీ

ఉత్తరాఖండ్‌లో ఈసారి బిజెపి, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా పోటీ తీవ్రంగా ఉంది. అయితే బిజెపి నామమాత్రంగా కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉందని ఎగ్జిట్ పోల్స్‌తో వెల్లడైంది. మొత్తం 70 స్థానాల అసెంబ్లీలో బిజెపికి 37, కాంగ్రెస్‌కు 31, ఆప్‌నకు 1, ఇతరులకు 1 వస్తాయని టైమ్స్ నౌ వీటో సర్వేలో వెల్లడైంది. ఇక ఏబిపిసీ ఓటర్ సర్వేలో బిజెపికి 2632, కాంగ్రెస్‌కు 3238, ఆప్ 2 ఇతరులకు 3 నుంచి 7 సీట్లు వస్తాయని తేల్చారు. టుడేస్ చాణక్య సర్వేలో బిజెపికి 36 నుంచి 50, కాంగ్రెస్‌కు 17 31, ఆప్ సున్నా, ఇతరులకు ఆరు వరకూ వస్తాయని వెల్లడించారు.

గోవాలోనూ పవర్ రేసు?

తీర రాష్ట్రం గోవాలో పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్‌తో వెల్లడైంది. అయితే 40 స్థానాల గోవాలో బిజెపికి 18 సీట్లు, కాంగ్రెస్‌కు 15 వస్తాయని వెల్లడైంది. అయితే ఇక్కడ అధికార స్థాపనకు మెజార్టీ సంఖ్య 21. దీనితో రెండు కీలక పార్టీలూ అధికారాన్ని సొంతంగా అందుకోవడం క్లిష్టం అవుతోంది. దీనితో ఇంతకు ముందటిలాగానే ఇక్కడ ఎమ్మెల్యేలకు గాలాల వేట ఆరంభం అవుతుందని భావిస్తున్నారు. 2017 ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల పార్టీగా నిలిచినా బిజెపి దూకుడుతో అధికారానికి రాలేకపోయింది.

మణిపూర్‌లోనే బిజెపి విజయం

ఈసారి ఎన్నికలలో మణిపూర్‌లో బిజెపి అధికారం దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 60 స్థానాల అసెంబ్లీలో బిజెపికి 30 స్థానాలు వస్తాయని, ఈ విధంగా మెజార్టీ బలానికి ఒక్క స్థానం తక్కువ అవుతుందని విశ్లేషించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 14 స్థానాలు వస్తాయని తేల్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News