Friday, September 13, 2024

60 ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా మార్గాల్లో కొనసాగుతోన్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రానున్న విజయదశమి, దీపావళి, ఛాత్ పూజ పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని గమనించి ఈ ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పొడిగించిన రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని కాచిగూడ నుంచి మధురై, మధురై నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ , నాగర్ కోయిల్ నుంచి కాచిగూడ , సికింద్రాబాద్ నుంచి రామనాథపురం, రామనాథపురం నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి కొల్లం,

కొల్లం నుంచి సికింద్రాబాద్ డిసెంబర్ వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. అలాగే నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్, మచిలీపట్నం నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి అగర్తలా, హైదరాబాద్ నుంచి జైపూర్, హైదరాబాద్ నుంచి గోరక్పూర్, తిరుపతి నుంచి షిర్డీ సాయినగర్, తిరుపతి నుంచి అకోలా, అకోలా నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి దానాపూర్, సంత్రాగాచి నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్, కాచిగూడ నుంచి తిరుపతి, షాలీమార్ నుంచి సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్‌తో పాటు పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడవనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News