Wednesday, May 8, 2024

2020 సిఎస్‌ఇ అభ్యర్థులకు మరో చాన్స్‌కు కేంద్రం సమ్మతి

- Advertisement -
- Advertisement -

Extra Chance For UPSC Civil Services Exam

న్యూఢిల్లీ: కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో 2020లో చివరి ప్రయత్నంగా యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరైన అభ్యర్థులకు ఒకే ఒక్క సారి మినహాయింపు ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వయో పరిమితి దాటిన వారికి ఈ మినహాయింపు వర్తించదని కూడా కేంద్రం తెలిపింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(సిఎస్‌ఇ)-2020కు చివరి ప్రయత్నంగా హాజరైన అభ్యర్థులు, వయో పరిమితి దాటని వారు సిఎస్‌ఇ-2021 హాజరుకావడానికి ఒకే ఒక్క సారి అవకాశం ఇస్తామని జస్టిస్ ఎఎం ఖాన్‌విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియచేసింది. అయితే నిబంధనల ప్రకారం సిఎస్‌ఇ-2021 రాసేందుకు వయో పరిమితి దాటిన వారికి, పరీక్ష రాసేందుకు అవకాశాలు ఇంకా ఉన్నవారికి ఎటువంటి మినహాయింపులు ఉండవని కేంద్రం లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నోట్‌లో తెలిపింది. సిఎస్‌ఇ-2020 రాసిన అభ్యర్థులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది. ఇది ఒకే ఒక్కసారి ఇస్తున్న అవకాశం మాత్రమేనని, భవిష్యత్తులో ఇది ఏరకంగాను ఆనవాయితీ కాబోదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Extra Chance For UPSC Civil Services Exam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News