Wednesday, May 8, 2024

హుషారైన పాటకు స్పైసీ డ్యాన్సులు

- Advertisement -
- Advertisement -

హుషారైన పాటకు స్పైసీ డ్యాన్సులు

F3 Movie dances

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎఫ్ 3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని శుక్రవారం విడుదల చేసింది. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ డిఫరెంట్ అండ్ క్యాచి ట్యూన్‌ని కంపోజ్ చేశారు. వినగానే హుషారుగా డ్యాన్స్ చేయాలనిపించే విధంగా పాటని డిజైన్ చేశారు.

ఈ పాటలో తమన్నా, మెహ్రీన్ గ్లామర్ అండ్ స్పైసీ డ్యాన్స్‌తో కనువిందు చేశారు. మూడో హీరోయిన్‌గా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా ఈ పాటలో అలరించింది. ఈ పాటకు శేఖర్ విజె అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో సందడి చేయనుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ‘ఎఫ్ 3’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News