Sunday, April 28, 2024

క్రేజీ రీమేక్‌లో హుషారైన జానపద పాట

- Advertisement -
- Advertisement -

Fabulous Folk song in Ayyappanum koshiyum remake

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్‌లలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె.చంద్ర తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పణం కోషియం’ రీమేక్ కూడా ఒకటి. మాస్‌లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఇక ఈ చిత్రంలో ఓ అదిరే జానపద పాట కూడా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. ఈ పాటకు రాయలసీమ జానపద గేయ రచయిత పెంచల్ దాస్ సాహిత్యం అందిస్తున్నాడట. అయితే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తున్నాడు. ఇక పెంచల్ దాస్‌ను త్రివిక్రమ్ తన ‘అరవింద సమేత’ తో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ చిత్రంలో పవన్ బ్యాక్‌డ్రాప్ కూడా రాయలసీమ టచ్ లోనే ఉంటుందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News