Tuesday, May 7, 2024

సోనుసూద్ పేరుతో మోసం…

- Advertisement -
- Advertisement -

Fake account with Sonu Sood corporate name on Twitter

సోనుసూద్ పేరుతో మోసం
సాయం కోరిన బాధితుల నుంచి డబ్బులు వసూలు
బాధితుడి నుంచి రూ.60,000 వసూలు
ట్విటర్‌లో సోనుసూద్ కార్పొరేట్ పేరుతో నకిలీ ఖాతా
నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్: సాయం అడుగుతున్న పేదవారిని కూడా వదలడంలేదు సైబర్ నేరస్థులు. కరోనా సమయంలో పేదలకు ఆర్థిక సాయం చేసి రీల్ హీరో కాదు, రియల్ హీరోగా నిలిచాడు సోనుసూద్. దానిని ఆసరాగా చేసుకుని సాయం కోరిన బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సోనుసూద్ కార్పొరేట్ సంస్థ పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్‌కు చెందిన ఆశిష్ కుమార్ సింగ్ తాను సోనుసూద్ కార్పొరేషన్ సలహాదారుడిగా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాడు. ట్విట్టర్ నకిలీ ఖాతా తెరిచి తన ఫోన్ నంబర్ పెట్టాడు. సోనుసూద్ కార్పొరేషన్‌ను ఆర్థిక సాయం కోసం బాధితుడు గూగుల్‌లో వెతగా నిందితుడి నంబర్ ఉంది. దానిని తీసుకుని ఫోన్ చేశాడు.

తన పేరు పంకజ్ సింగ్ భహదూరియా అని, బాధితుడికి వాట్సాప్‌లో ఐడి కార్డును కూడా పంపించాడు. బాధితుడు తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని రూ.10,000 సాయం కావాలని అడిగాడు. నిందితుడు బాధితుడిని ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు కావాలని కోరగా వాటిని వాట్సాప్ ద్వారా పంపించాడు. సోనుసూద్ మీ కుటుంబం గురించి విచారణ చేశాడని, ఆర్థిక సాయం చేసేందుకు ఒప్పుకున్నాడని తెలిపాడు. ఆర్థిక సాయం రూ.50,000 ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు రిజిస్ట్రేషన్‌కు రూ.8,300 చెల్లించాలని చెప్పడంతో వెంటనే పంపించాడు. తర్వాత గత నెల 1వ తేదీన ఫోన్ చేసి సాయం రూ.3,60,000 ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు.

వాటికి ఖర్చులు పంపించాలని చెప్పడంతో రూ.24,700, రూ. 14,100, రూ. 12,900 తీసుకున్నాడు. వివిధ కారణాలు చెప్పి నిందితుడు బాధితుల వద్ద నుంచి రూ.60,000 వసూలు చేశాడు. అయినా కూడా ఆగకుండా మళ్లీ ఫోన్ చేసి ఆర్థిక సాయం కావాలంటే చివరిసారిగా రూ.7,900 చెల్లిస్తే వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితులు తాము మోస పోయామని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్సై విజయవర్దన్, పిసిలు రాజ్‌కుమార్, మహేష్ గౌడ్, అర్షద్, అనిల్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News