Sunday, April 28, 2024

ఫేక్ మీడియానే బిడెన్ గెలుపుపై ప్రచారం కొనసాగిస్తోంది: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Fake media continues to campaign for Biden victory: Trump

 

వాషింగ్టన్: అధ్యక్ష ఎనికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయాన్ని అంగీకరించేందుకు డొనాల్డ్ ట్రంప్ నిరాకరిస్తూనే ఉన్నారు. ఆదివారం ఉదయం(భారత్‌లో రాత్రి) బిడెన్ ఎన్నికను ట్రంప్ అంగీరించినట్టు వార్తలు రాగా, తన ఉద్దేశం అది కాదంటూ వరుస ట్విట్లతో వివరణ ఇచ్చారు. ఫేక్ మీడియా వరుసగా బిడెన్ జనవరిలో అధ్యక్ష పదవి చేపట్టబోతున్నట్టు ప్రచారం సాగిస్తున్నదంటూ మండిపడ్డారు. అమెరికాలోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు నవంబర్ 3న బిడెన్ ఎన్నికైనట్టు ప్రకటించాయి. ఆ దేశ ఎన్నికల అధికారులు కూడా రిగ్గింగ్ జరిగిందంటూ ట్రంప్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ మాత్రం విస్కాన్సిన్‌లో రీ కౌంటింగ్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్సిల్వేనియా, నెవాడా, మిచిగన్, జార్జియా, అరిజోనా రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ కోర్టుల్లో కేసులు వేశారు. రిగ్గింగ్ ద్వారా దేశాన్ని దొంగిలించేందుకు అంగీకరించబోమని ట్విట్ చేశారు. తనకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News