Tuesday, April 30, 2024

పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే సినిమా

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్, విజయ్ ఫ్యాన్స్ హాజరయ్యారు. శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మూవీ టీమ్ వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ “ ఫ్యామిలీ స్టార్ సినిమా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ సినిమాను ఇష్టపడతారు. ఈ కథలోని ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు. నేను, విజయ్… గీత గోవిందం సినిమా చేశాం. మళ్లీ మేము కలిసి సినిమా చేస్తున్నామంటే అది గుర్తుండిపోయే మూవీ కావాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేసేందుకే ప్రయత్నంచాను. విజయ్ ఇప్పటిదాకా చేసిన పర్ ఫార్మెన్స్‌లు ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు అనుకోవచ్చు. ఇందు క్యారెక్టర్‌ను మృణాల్ అద్భుతంగా పోషించింది. ఈ సినిమాకు నేను రాసిన ప్రతి మాట నా గుండెల్లోనుంచి వచ్చిందే”అని తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “మన ఫ్యామిలీస్‌లోని ఎమోషన్స్ అన్నీ కలిపి తయారు చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్.

ఈ సినిమా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. సకుటుంబంగా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. పరశురామ్ విజయ్ క్యారెక్టర్‌ను బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశాడు. అతను నవ్విస్తాడు, ఫైట్స్ చేస్తాడు, కోపం వస్తే కొట్టమని హీరోయిన్ తో దెబ్బలు తింటాడు. ఫ్యామిలీ స్టార్ చూశాక అమ్మాయిలకైతే విజయ్ క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. నన్ను లక్కీ హ్యాండ్ అంటారు గానీ మృణాల్ లక్కీ హీరోయిన్. సీతారామం, హాయ్ నాన్న సినిమాల తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో హ్యాట్రిక్ అందుకోబోతోంది.

ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ మూవీని ఎంజాయ్ చేయండి”అని అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ప్రతి ఫ్యామిలీలో స్టార్ ఉంటాడు. ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా నాకు దక్కడం, ఆ సినిమాను మీ ముందుకు నా ద్వారా తీసుకురావడం ఒక ఆశీర్వాదంలా భావిస్తున్నా. ఈ సినిమాలో నా పర్‌ఫార్మెన్స్ నెక్స్ లెవెల్ అని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్‌దే”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత శిరీష్, గాయని మంగ్లి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News