Saturday, April 27, 2024

హోలీ సెలబ్రేషన్స్ లో ‘ఫ్యామిలీ స్టార్‘ టీమ్.. మృణాల్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లు హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. వీరి కాంబినేషన్ వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ నుంచి మూడో సాంగ్ విడుదల సంధర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో సందడి చేసింది. అభిమానుల మధ్య మూవీ టీమ్ రంగులు చల్లుకుని హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. విజయ్, మృణాల్ లు.. ఈ సినిమాలోని ‘కల్యాణీ వచ్చా వచ్చా..’ అనే సాంగ్ కు డ్యాన్స్ చేశారు. మృణాల్ తన డ్యాన్స్ తో అలరించింది. తాజాగా విడుదలైన థర్డ్ సింగిల్ ‘మధురము కదా..’ విడుదలైన సాంగ్ ఆకట్టకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్ పాడారు.

ఇక, ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News