Tuesday, May 7, 2024

రైతులు గోదాములను వినియోగించుకోవాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు గోదాములను వినియోగించుకోవాలని కోదాడ శాస నసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు 1000 మెట్రిక్ టన్నుల సామర్ధం కలిగిన గోదాం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఛైర్మన్ నంబూరి సూర్యం అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే గోదాము నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రైతులు వారు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర వచ్చే వరకు, దళారుల చేతులలో మోసపోకుండా గోదాములను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి చింత కవితరాధారెడ్డి, గ్రామ సర్పంచ్ కాసాని వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ తొండపు సతీష్, ఏడిఏ వాసు, మాజీ ఎంపిటిసి గంటా శ్రీనివాస్, సంఘ డైరెక్టర్లు నల్లూరి రమేష్, బాలేబోయిన వెంకటేశ్వర్లు, ముత్తవరపు వీరయ్య, మల్లెల ఆదినారాయణ, ఉన్నం హనుమంతరావు, మల్లెల పుల్లయ్య, మందలపు శేషు, కాపుగల్లు, రెడ్లకుంట గ్రామాల రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News