Tuesday, April 30, 2024

ప్రపంచంలో అణుయుద్ధ భయాలు

- Advertisement -
- Advertisement -

Fears of nuclear war in the world

వార్‌హెడ్స్ తరలించిన బ్రిటన్
పోలెండ్‌పై రష్యా తీవ్రస్థాయి దాడులు
పుతిన్ కుటుంబం అజ్ఞాతంలోకి
బంకర్లకు పెరిగిన డిమాండ్

కీవ్/లండన్ : రష్యా ఉక్రెయిన్ భీకర యుద్ధం దారితప్పి అత్యంత ప్రమాదకరమైన ప్రపంచస్థాయి అణుయుద్ధానికి చేరుకుంటుందనే సంకేతాలు తలెత్తాయి. రష్యా ఉన్నట్లుండి అణుదాడులకు దిగే ప్రమాదం ఉందనే నిఘా సమాచారంతో ఐరోపా నాటో దేశాలల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బ్రిటన్‌లో సోమవారం ఉదయం నుంచే బ్రిటన్‌లో అణ్వాయుధాలతో కూడిన శకటాలు సైనిక ప్రాంతాలలో కలియతిరిగాయి. ఈ వార్ హెడ్‌ల సమాయత్తం ఎటుదారితీస్తుందనే భయాందోళనలు నెలకొంటున్నాయి. నాటో దేశాలకు రష్యాకు మధ్య ఇప్పటి ఉక్రెయిన్ యుద్ధం తీవ్రస్థాయి ప్రచ్ఛన్న పోరుకు దారితీసింది. నాటో దేశాల వెన్నుదన్నులతోనే ఉక్రెయిన్ దాడులకు వెరవకుండా సుదీర్ఘస్థాయి సమరానికి సిద్ధం అయిందని రష్యాయ భావిస్తోంది. దీనితో తీవ్రస్థాయిలోనే సూపర్‌సోనిక్ విమానాలతో దాడులు ముమ్మరం చేసింది. రష్యా వైఖరిని గమనించే నాటోలో కీలక దేశం అయిన బ్రిటన్ తన ట్రైడెంట్ ఖండాంతర క్షిపణులకు అమర్చే అణువార్ హెడ్లను ట్రక్కులపై ఉంచి బహిరంగంగానే కీలక ప్రాంతాలకు తరలించింది. దీనికి సంబంధించిన చిత్రాలు సంచలనానికి దారితీశాయి.

ముందుగా అమెరికాను కాకుండా బ్రిటన్‌ను తమ అణ్వాయుధాలతో దెబ్బతీయడం ద్వారా నాటో కూటమికి చెక్ పెట్టి ప్రపంచస్థాయిలో ఆధిపత్యం చాటుకోవాలని రష్యా ఆలోచిస్తోందని పశ్చిమ దేశాలకు నిఘావర్గాలతో సమాచారం అందింది. రష్యా వద్ద దాదాపు రెండు వేల వరకూ అత్యంత వ్యూహాత్మక అణ్వాయుధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పైనే కాకుండా ఇప్పుడు రష్యా పోలెండ్‌పై కూడా దాడులను తీవ్రతరం చేసింది. తమ దేశంపై కూడా దాడికి దిగుతుందని బ్రిటన్ ఇతర దేశాలు అనుమానిస్తున్నాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా నాటో నాటో వ్యతిరేక కూటమి దేశాలలో ఇప్పుడు అణ్వాయుధ భయాల నేపథ్యంలో దాడులు జరిగితే తలదాచుకునే అత్యంత పటిష్టమైన ప్రత్యేకమైన బంకర్లనుతీర్చిదిద్దుకుంటున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తన కుటంబాన్ని భార్యను ప్రియురాలు అలీనా కబయేవా ఆమె సంతానాన్ని గుర్తు తెలియని రహస్య ప్రాంతాలకు తరలించినట్లు యూరప్ దేశాలలో వార్తలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News