Sunday, April 28, 2024

నకిరేకల్ బిఆర్ఎస్ లో నువ్వా,నేనా?

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ నాకే వస్తుంది.. సిట్టింగ్‌ను నేను.. సిఎం కెసిఆర్ ఆశీస్సులు నాకే ఉన్నాయి.. బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టిక్కెట్‌పై క్లారిటీ ఇస్తారనే ఆశలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పార్టీకోసం కష్టపడ్డా.. ఉద్యమ సమయంలో నేను జనానికి ఉద్యమకారులకు అండగా ఉన్నా.. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేశా.. ఇప్పటికి సిఎం కెసిఆర్ ఎలక్షన్ నాటికి తనవైపే మొగ్గుచూపుతారనే ఆశలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇలా ఇరువురు నేతలు కూడా తనదంటే తనదే టిక్కెట్ అంటూ పోటీపడుతున్నారు. నకిరేకల్ ని యోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీలో టిక్కెట్ రేసు పోటాపోటీగా నడుస్తోం ది. ఇరువురి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిరుమర్తి లింగయ్య ఆపార్టీని వీడి కారెక్కారు.

అప్పటివరకు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ను ముం దుకు తీసుకుపోయిన మాజీఎమ్మెల్యే వీరేశంకు ప్రాధాన్యత తగ్గింది. అక్కడి నుంచి ఇరువురి మధ్య వివాదం మొదలైంది. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇరువురు కీలకనేతల మధ్యపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కేడర్ కూడా ఎటువెళ్ళాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. ఒకరు సిట్టిం గ్ ఎమ్మెల్యే అయితే.. మరొకరు పార్టీకోసం కష్టపడ్డ మాజీఎమ్మెల్యే కావడంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నచందంగా అధిష్టానం పరిస్థితి తయారైంది. ఇద్దరు కీలకమైన వారే కావడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే గెలుపు గుర్రాలకే టిక్కెట్‌లు ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించడంతో తనకంటే తనకే వస్తాయనే ఆశలో ఇరువురు నేతలు ఉన్నారు.

అయితే ఎమ్మెల్యే చిరుమర్తికి ఓవర్గం మద్దతుపలికితే.. మాజీఎమ్మె ల్యే వీరేశంకు మరోవర్గం అండగా నిలుస్తుంది. చిరుమర్తికి రాష్ట్ర వి ద్యుత్‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గు త్తా సుఖేందర్‌రెడ్డి వర్గాలు మద్దతుగా ఉన్నాయి. మాజీఎమ్మెల్యే వీరేశంకు శాసనమండలి మాజీడిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డితో పాటు మరికొందరు అండగా నిలుస్తున్నారు. ఇరువురు నేతలు కూడా పోటీచేయాల్సిందే.. తగ్గేదేలేదంటూ పోస్టులు పెట్టడమే కాకుండా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. చిరుమర్తి తనకేడర్‌తో పాటు నేతలను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయితే.. వీరేశం మా త్రం ఆయనకు వ్యతిరేకంగా మున్సిపల్, సహకార ఎన్నికల్లో ఫార్మర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టి తనసత్తా చాటుకున్నారు.

కా నీ ఇద్దరు కూడా ఢీ అంటే ఢీ అన్నట్లు ముందుకు పోతుండటంతో బిఆర్‌ఎస్ నేతలు అయోమయానికి గురవుతున్నారు. అధిష్టానం చొ రవ తీసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చాల్సిన అవసరం ఎం తైనా ఉంది. ఇవన్నీ ఇలాఉంటే బలమైన వారు కావడంతో ఇతర మార్గాలను అన్వేషించే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. ఒకరికి టిక్కెట్ వస్తే మరొకరు పార్టీని వీడి పోటీచేసే అవకాశాలున్నాయి. ఏదిఏమైనా నకిరేకల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఆధిపత్యపోరుతో పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News