Wednesday, May 22, 2024

పాన్ ఇండియా రేంజ్‌లో

- Advertisement -
- Advertisement -

Fighter Movie create Fan india Range

 

విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కేంచేందుకు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నాడు. అందుకోసమే ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ ను భాగస్వామిగా చేసుకోవడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను విజయ్ దేవరకొండకు జోడీగా నటింపజేస్తున్నాడు. ఈ కారణాల వల్ల సినిమాకు పాన్ ఇండియా బజ్‌ను తీసుకురావాలనుకున్నాడు. అయితే కరణ్ జోహార్ ఈమద్య కాలంలో వివాదాస్పదం కావడంతో పాటు అనన్యపాండే కు నెపొటిజం దెబ్బ పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ‘ఫైటర్’ మూవీకి హిందీ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్‌ను కూడా నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చారట.ప్రముఖ హిందీ నటుడిని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటింపజేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ లాక్‌డౌన్ సమయంలో స్క్రిప్ట్‌లో చిన్న మార్పులు చేసి ఒక పాత్రను పెంచి… ఆ పాత్రకుగాను హిందీ నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా కథ ఉంటుందని మొదటి నుండి మేకర్స్ చెబుతున్నారు. ఈ మేరకు పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News