Saturday, April 27, 2024

స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident,

హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. హబీబ్‌నగర్‌లో ఉన్న రాయల్‌ స్క్రాప్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాంలోని కంప్రెషర్‌ సిలిండర్‌ పేలడంతో ఈ మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Fire accident in scrap godam at nampally hyderabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News