Tuesday, April 23, 2024

పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన కారు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: నగరంలోని షేక్ పేట్ పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ  కారులో పెట్రోల్ పోస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్నవారు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. మంటల కారణంగా పెట్రోల్ బంకులో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెట్రోల్ బంకులో భారీగా మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదం కారణంగా షేక్ పేట్, రాయదుర్గం మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపివేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Fire broke out at Shaikpet Indian Oil Petrol Bunk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News