Wednesday, May 8, 2024

300 కోట్ల ఏండ్ల కిందటి అపురూప నీలం కృష్ణశిల

- Advertisement -
- Advertisement -

మైసూరు : ఇప్పుడు బాలరాముడు అయి నవ్వులు చిందిస్తున్న బాలరాముడు అత్యంత అపురూపమైన కృష్ణశిల నుంచి విగ్రహ స్వరూపం దాల్చాడు. ఆద్యంతం ఆకాశపు నీలిరంగు కాంతులు వెదజల్లే ఈ రాయి అత్యంత అరుదుగా లభిస్తుంది. విచిత్రమైన రీతిలో కర్నాటకలోని హెచ్‌డి కోటే తాలూకాలోని జయపుర హోబ్లిలో ఉన్న గుజ్జెగౌడనపురాలో ఈ కృష్ణశిల దొరికింది. ఎర్త్‌సైన్సెస్ విభాగంలో యుజిసి ప్రొఫెసర్ ఒకరు చెప్పినవివరాల ప్రకారం ఈ రాయి దాదాపుగా 3 బిలియన్ ఏండ్ల కిందటిది. అత్యంత ముదురు నీలం దాదాపు ఆకాశం రంగులో ఉండే ఈ రాయి పురాతనమైనదని, తాము సాగించిన భూగర్భపరిశోధనల దశలో వెల్లడైందని చెప్పారు. కర్నాటకకు చెందిన కాంట్రాక్టరు 78 ఏండ్ల రామదాసు తన పొలం చదునుచేయిస్తూ ఉండగా ఈ అరుదైన నీలం రాయి దొరికింది. ఇటువంటి రాయి ఆయన వద్ద ఉందనే విషయాన్ని ఏదో విధంగా అయోధ్య ట్రస్టీలకు తెలిసింది. తరతరాలు పాటు నిలిచే ఉండేలా చేయాల్సిన రామ విగ్రహాన్ని మలిచే రాయి కోసం అన్వేషణ దశలో వారు ఈ భూ యజమానిని సంప్రదించారు.

ఈ రాయి నాణ్యతను పరీక్షించారు. అత్యంత ప్రామాణికంగా ఉందని నిర్థారించారు. దీనితో ఈ రాయిని శిల్పంగా తీర్చిదిద్దేందుకు ఎంపికచేశారు. విచిత్ర రీతిలో కర్నాటకకు చెందిన శిల్పి ఈ రాయిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. తన పొలంలో దొరికిన రాయి ఈ విధంగా అయోధ్య గుడిలో దైవం కావడం పట్ల ఈ భూమి యజమాని రామ్‌దాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రాయి లభించిన నాలుగు గుంటల జాగాను ఇక్కడ ఓ రామాలయ నిర్మాణానికి తనవంతుగా అర్పించుకుంటానని తెలిపారు. అనుకున్న విధంగానే సోమవారం అయోధ్యలోరామాలయ ప్రతిష్ట సమయంలోనే కర్నాటకలో ఈ భూమిలో ఈ ఆసామీ నిర్మించే ఆలయానికి శంకుస్థాపన జరిగింది. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజామున జరిగిన ఈ కార్యక్రమానికి ఛాముండేశ్వరి ఎమ్మెల్యే జిటి దేవెగౌడ , స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ ఆలయంలో విగ్రహ రూపకల్పన బాధ్యతలు తీసుకోవాలని అరుణ్ యోగిరాజును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News