Tuesday, May 7, 2024

తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్సకారులకు లబ్ధి

- Advertisement -
- Advertisement -

పర్వతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే మత్సకారుల కష్టాలు తీరి లబ్ధి పొందారని బిఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. మత్సకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. సోమవారం వర్ధన్నపేట మండలం నల్లబెల్లి చెరువులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి రూ. 4.24 లక్షల విలువ గల 2.58 లక్షల ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలారు. అనంతరం ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సంబంధించిన రూ. 10లక్షల ప్రొసీడింగ్ కాపీని గ్రామస్థులకు అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్సకారులు డబ్బులు పెట్టి చేప పిల్లలను పెంచే స్తోమత లేని వారికి వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. మత్సకారుల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సొసైటీ ఏర్పాటుచేసి హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

* వర్ధన్నపేట మండలం నల్లబెల్లి, రాందాన్‌తండాకు చెందిన 10 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 10 లక్షల చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెళ్లిళ్ల భారం తగ్గిందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News