Wednesday, May 22, 2024

కార్లలో ఫ్లెక్స్‌ఫ్యూయల్ ఇంజన్లు

- Advertisement -
- Advertisement -

'flex-fuel' vehicles in next 3-4 months

గడ్కరీ ప్రకటన త్వరలో ఆదేశాలు

పుణే : కార్ల తయారీదార్లు వాహనాలలో ఫ్లెక్స్ ప్యూయల్ ఇంజన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తాము వచ్చే రెండుమూడు నెలల్లో అధికారిక ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర రవాణా, హైవేల మంత్రి నితిన్‌గడ్కరీ శుక్రవారం ఇక్కడ తెలిపారు. పెట్రోలు ప్రత్యామ్నాయపు ఇంధన భర్తీగా ఉండే ఇంజన్లను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లుగా వ్యవహరిస్తారు. దేశంలో పెట్రోలు, డీజిల్ వాడకం లేకుండా వాహనాలు నడవాలని, ఈ ఘట్టం తాను జీవితకాలంలో చూడాలని అనుకుంటున్నానని, ఇంధనంగా స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌ను విరివిగా వాడుకునే పరిస్థితి రావాలని గడ్కరీ సూచించారు. ఇక ముందు మార్కెట్‌లోకి వచ్చే కార్లు ఇతర వాహనాలకు అనువుగా ఉండే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు అమర్చాల్సి ఉంటుందన్నారు. బిఎండబ్లు, మెర్సిడెస్, టాటా , మహీంద్రా వంటి కార్లతయారీ కంపెనీలకు కూడా త్వరలోనే దీనిపై ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పుణేలో ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలో గడ్కరీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో కలిసి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News