Saturday, April 27, 2024

ఫ్లిప్‌కార్ట్‌పై రూ.10,600 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

Flipkart Served Rs 10600 Cr Show Cause Notice

ఫెమా నిబంధనల ఉల్లంఘించారంటూ ఇడి షాకాజ్ నోటీసులు
సమాధానమిచ్చేందుకు 90 రోజుల గడువు

న్యూఢిల్లీ : విదేశీ మారక చట్టం ఉల్లంఘించారనే ఆరోపణలకు గాను ఫ్లిప్‌కార్ట్, ఈ సంస్థకు చెందిన ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రూ.10,600 కోట్ల జరిమానా విధిస్తామంటూ ఈ నోటీసులు పంపింది. ఫ్లిప్‌కార్ట్, ఈ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లతో పాటు 10 మందికి ఫెమా (విదేశీ మారక నిర్వహణ చట్టం)లోని వివిధ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఈ నోటీసులు జారీ చేసినట్టు ఇడి తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గత నెలలోనే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని కంపెనీకి ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఫెమా చట్టాల ఉల్లంఘన

బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించినట్లు, డబ్ల్యూఎస్ రిటైల్ తన షాపింగ్ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు వస్తువులను విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయని ఇడి అధికారి తెలిపారు. ఇది చట్టం ప్రకారం నిషేధితమని తెలిపారు. జూలైలో ఇడి సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారు టైగర్ గ్లోబల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారికి ఎందుకు రూ. 10,600 కోట్లు జరిమానా విధించకూడదు అని ప్రశ్నించింది. ఈ కేసు 2009 నుండి 2015 మధ్య కాలానికి సంబంధించినది. ఫెమాలోని వివిధ సెక్షన్ల కింద నోటీసు జారీ చేసింది. నోటీసుపై స్పందించడానికి వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 90 రోజుల గడువు ఇచ్చింది. అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ తన భారతీయ ఇ-కామర్స్ విభాగం ఫ్లిప్‌కార్ట్ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) తీసుకురానున్నామని ఇటీవల ప్రకటించింది.

ఇడికి సహకరిస్తాం: ఫ్లిప్‌కార్ట్

ఈ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సహకరిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ భారతీయ చట్టాలు, నిబంధనల అమలు చేస్తోందని, నోటీసుల ప్రకారం, 20092015 కాలానికి సంబంధించిన ఈ అంశంపై అధికార యంత్రాంగానికి సహకరిస్తామని ఇకామర్స్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News