Friday, May 10, 2024

తల వెంట్రుకల మాఫియాపై ఇడి దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

ED investigation into head hair mafia

ఫెమాకు విరుద్ధంగా తల వెంట్రుకలను కొనుగోలు
చేసి ఎగుమతి చేస్తున్న ముఠాపై ఆరా తీస్తున్న ఇడి
దక్షిణాధి రాష్ట్రాల నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు గుర్తింపు, తెలుగు రాష్ట్రాల్లో తొమిది చోట్ల సోదాలు, హైదరాబాద్‌లో ఎనిమిది చోట్లు, గుంటూరులో జరిగిన సోదాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తల వెంట్రుకల మాఫియాపై ఇడి గత మూడు రోజులుగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తల వెంట్రుకలను ఇతర దేశాలకు కొనుగోలు చేస్తున్న ముఠాపై ఇడి ఆరా తీస్తోంది. ఫెమా (ఫారన్ ఎక్సైంజ్ మేనేజ్మెంట్) నిబంధనలకు విరుద్ధంగా తల వెంట్రుకల వ్యాపారం కొనసాగుతోందని, ఈ ముఠా దక్షిణాది రాష్టాల నుంచి ఎక్కువగా వెంట్రుకలను కొనుగోలు చేస్తోందని ఇడి గుర్తించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తల వెంట్రుకలతో తయారవుతున్న విగ్గులకు భారీ డిమాండ్ ఉండటంతో వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమమార్గంలో వెంట్రుకలను తరలిస్తున్నట్లు ఇడి దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో తెలుగు రాష్టాలలో 9 చోట్ల ఈడీ సోదాలు చేసింది.

హైదరాబాద్లో 8 చోట్ల, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఒక చోట సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. మయన్మార్ నుంచి చైనాకు హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు అక్కడి నుంచి మణిపూర్లోని మోరే, మిజోరాం, మీదుగా చైనాకు ఎయిర్ కార్గో పార్సిల్ ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా ఈ ముఠా తల వెంట్రుకలను తరలిస్తున్నట్లు ఇడి అధికారులు గుర్తించారు. కాగా నగరంలోని ఎల్‌బి నగర్‌లోని ఆర్టీసీ కాలనీలో అర్ధరాత్రి వరకు నరేష్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. నగరంలోని వికాస్ ఎంటర్ ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్పోర్టర్, హృతిక్ ఎగ్జిమ్, న్యాలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్ డైరెక్టర్ ఇబ్రహీం పటేల్ కంపెనీలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News