Thursday, May 2, 2024

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former Minister Kamatham Ram Reddy dies

హైదరాబాద్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత, కమతం రాంరెడ్డి(82)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్రక్రియలు మహబూబ్‌నగర్‌ మహమ్మదాబాద్‌లో జరుగనున్నాయి. ఉమ్మడి ఎపి‌లో పరిగి ఎంఎల్ఎగా మూడు సార్లు గెలిచారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. జలగం వెంకట్రావు, ఎన్‌ జనార్దన్‌రెడ్డి మంత్రివర్గాల్లో కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం హమ్మదాబాద్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ ఉన్న ఆయన 2014 ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బిజెపిలో చేరారు. టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. 2018 ఎన్నికల సమయంలో బిజెపి నుంచి బయటకు వచ్చి, టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.‌  ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం ప్రకటించారు.

Former Minister Kamatham Ram Reddy No more

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News