Friday, May 3, 2024

సట్టా నిర్వాహకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

Four arrested for operating satta

 

హైదరాబాద్ : సట్టా నిర్వహిస్తున్న నలుగురిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సంతోష్‌నగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.27,200 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని ఈదీబజార్‌కు చెందిన ఎండి ఒమర్ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. సంతోష్‌నగర్‌కు చెందిన నిసార్ అహ్మద్ వంటపనిచేస్తున్నాడు, రక్షపురానికి చెందిన ఎండి రహీం, మహారాష్ట్రకు చెందిన మీరరజ్, అమీర్, బాబా, పక్షి, మౌలా, సమద్, షాబీర్ కలిసి సట్టా నిర్వాహిస్తున్నారు. ఎండి ఒమర్, ఎండి అమీర్ ఇద్దరు సోదరులు. కుటుంబ అవసరాలకు వ్యాపారంలో వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో సట్టా ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన మీరజ్‌ను సంప్రదించి ఇక్కడ సట్టా నిర్వహించారు. నగరంలోని ఆటోడ్రైవర్లు, పాన్‌వెండర్లు, కూరగాయల వ్యాపారులు, హాస్టల్ వర్కర్లను టార్గెట్‌గా చేసుకుని సట్టా నిర్వహిస్తున్నారు. నిందితులు చెబుతున్న మాటలు నమ్మి చాలామంది అమాయకులు డబ్బులు కోల్పోతున్నారు. వచ్చిన డబ్బుల్లో కమీషన్ ప్రధాన నిందితుడికి పంపిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, నర్సింహులు, శ్రీనయ్య తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News