Thursday, April 25, 2024

రైతు వేదికలు దేశానికి ఆదర్శం: గద్వాల ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గట్టు: రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శవంతమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం గట్టు మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి, ఇందువాసి గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు గట్టు మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తెలంగాణ వచ్చాక గట్టు మండలంలో సాగుకు నీరందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. కేసీఆర్ లక్షానికి అనుగునంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సాగునీటి వసతి, 24గంటల విద్యుత్, రైతుబందు, రైతుభీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూసుకుంటోందన్నారు.

గత పాలకులు రైతుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. అవినీతి లేకుండా పారదర్శకమైనపాలన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్‌గౌడ, ఎంపీపీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బాసుశ్యామల, వైస్ ఎంపీపీ సుమతి, పీఏసీయస్ చైర్మన్ వెంకటేష్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు హనుముంతు నాయుడు, సర్పంచులు శంకరమ్మ, జీవమ్మ, ఎంపీటీసీ ఆనంద్‌గౌడ, బుజ్జన్న, పారిజాతం, బుచ్చమ్మ, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఇమామ్ సబ్, వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ మహానంది రెడ్డి, తెరాస పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, అంగడి బస్వరాజ్, రామాంజనేయులు, వెంకటన్న గౌడ్, శ్రీనాథ్, తిమ్మప్ప, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News