Monday, May 13, 2024

‘హస్త’ వ్యస్తం

- Advertisement -
- Advertisement -

రణరంగంగా మారిన గాంధీభవన్

పిసిసి సారథి రేవంత్ ఇంటిని ముట్టడించిన ఆశావహుల అనుచరులు
గాంధీభవన్‌కు తాళం

కాంగ్రెస్, రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు చల్లార డం లేదు. రెండో జాబితా విడుదల తర్వాత మొ దలైన ఆగ్రహజ్వాలలు, మూడో జాబితా తర్వాత తారాస్థాయికి చేరాయి. టికెట్ దక్కని ఆశావహు ల ఆందోళనలు నిన్నటి వరకు గాందీభవన్ వరకే పరిమితం కాగా, మంగళవారం ఏకంగా పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకే చేరుకోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీం తో పాటు పలు నియోజకవర్గాల్లో నిరసన సెగలు ఎగిసిపడ్డాయి. బోథ్, వనపర్తి, చెన్నూరు, పాలకు ర్తి, డోర్నకల్, తుంగతుర్తి, సంగారెడ్డిలో ఆందోళన లు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో కాం గ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహంతో రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించి రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోపాటు గాంధీభవన్ ఎదుట టికెట్ ఆశించిన ఆశావహులు తమ అను చరులతో కలిసి ధర్నా నిర్వహించడంతో భయాం దోళనకు గురైన కాంగ్రెస్ నాయకులు గాంధీభ వన్‌కు తాళాలు వేసి కార్యకర్తలు, నాయకులు లో పలకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో గాంధీభ వన్ దగ్గర పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశా రు. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పని చేస్తున్న తమను కాదని ఇటీవల పార్టీలోకి వచ్చిన పా రాచూట్ నేతలకు టికెట్ ఇవ్వడమేంటని టికెట్ రాని ఆశావహుల అనుచరులు కాంగ్రెస్ అధిష్టా నాన్ని నిలదీశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News