Monday, May 13, 2024

సిఎం కెసిఆర్ కృషితో దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ, ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలోని ఇబ్బందుల్ని అదిగమించేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది. అన్నిరంగాల్లో తెలంగాణని అగ్రపథాన నిలుపుతున్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తున్నారు. ఈ మేరకు గతంలో కర్ణాటకలోని హైగ్రేడ్ మిల్లింగ్ సామర్థ్యం కలిగిన సటాకే యంత్రాలను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ రోజు మంత్రిని సటాకే ప్రతినిధులు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం త్వరలో తీసుకువస్తున్న ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాటు చేసే రైస్ మిల్లులకోసం సటాకె యంత్రాలను అందుబాటులో ఉంచడమే కాక బహిరంగ మార్కెట్ కన్నా పది శాతం తక్కువ ధరకే యంత్రాలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు మంత్రికి వివరించారు. అత్యాదునిక సాంకేతికత కలిగిన సటాకే యంత్రాలు గంటకు 21 టన్నుల సామర్థ్యంతో రోజుకు 500 టన్నులకు పైగా ధాన్యం మిల్లింగ్ తో పాటు అవసరమైన కరెంటుని సైతం బైప్రోడక్టుగా వచ్చే ఉనుక నుండి ఉత్పత్తి చేసుకోవడం వీటి ప్రత్యేకతలుగా వివరించారు. ఏ క్లస్టర్లో ఏర్పాటు చేసే మిల్లులకు అనుగుణంగా ప్రతీ చోట అక్కడే ట్రైనింగ్ మరియు 24గంటల సర్విసింగ్ సెంటర్లను సైతం కంపేనీ ఏర్పాటు చేస్తుందన్నారు.

భారత ఉపఖండంలోని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో తమ కంపెనీ సటాకే కార్యకలాపాలు నిర్వహిస్తుందని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ కృషితో రాష్ట్రమంతా కాళేశ్వర జలాలు అందుబాటులోకొచ్చి ప్రతీ సంవత్సరం దాదాపు 3కోట్ల టన్నుల పైచీలుకు ధాన్యం తెలంగాణలో పండుతుందని, ఎఫ్.సి.ఐ సేకరించే ధాన్యంలో అత్యధిక శాతం మన రాష్ట్రం నుంచే జరుగుతుందని. అయితే ఇంతమొత్తంలో ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటివరకూ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు సీఏంఆర్ డెలివరీలో ఉన్న ఇబ్బందుల్ని అధిగమించడానికి సటాకె యంత్రాల సహాకారం చాలా ఉపయోగపడుతుందని వెల్లడించారు. తెలంగాణ పుడ్ ప్రాసెసింగ్ జోన్లకు ప్రత్యేక రాయితీతో యంత్రాలు అందించేందుకు ముందుకువచ్చినందుకు సటాకె కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు. సటాకె కంపెనీ ప్రతినిధులు చేసిన ప్రతిపాధనలు సిఎం కెసిఆర్ ద్రుష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా డైనమిక్ మంత్రి కెటిఆర్ చేస్తున్న కృషి మూలంగా ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, రోడ్లు, మౌళిక వసతులు కల్పించడమే కాక త్వరితగతిన సింగిల్ విండో విదానంతో అనుమతులు ఇస్తూ తెలంగాణ దేశానికే ఆధర్శంగా నిలుస్తుందన్నారు. ఈ అవకాశాల్ని యువ పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో సటాక కంపెనీ డైరెక్టర్ రాజిందర్ కె.బజాజ్, ఎజిఎం సతీష్ కుమార్, ప్రతినిధులు విఠల్, వినయ్ పాల్గొన్నారు.

Gangula Kamalakar meet Satake representatives in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News