Thursday, May 2, 2024

గ్యాస్‌ సిలిండర్‌‌ ధర రూ.50 పెంపు

- Advertisement -
- Advertisement -

Gas cylinder price hike by Rs 50

 

న్యూఢిల్లీ : పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కు చేరింది. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News