Sunday, May 5, 2024

ఐసిసిపై గంభీర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అనుసరిస్తున్న ర్యాంకింగ్స్ విధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్థం పర్థంలేని ర్యాంకింగ్స్ పద్ధతి వల్ల చాలా జట్లకు తీవ్ర నష్టం కలుగుతోందన్నాడు. ఇటీవల ఐసిసి ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌ను గంభీర్ తప్పుపట్టాడు. క్రికెట్ సిరీస్‌లు పూర్తిగా నిలిచిన సమయంలో ర్యాంకింగ్స్‌ను ప్రకటించడం సమంజసం కాదన్నాడు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడూ ర్యాంకింగ్స్‌లను ప్రకటిస్తే బాగుంటుందన్నాడు. కరోనా మహమ్మరి దెబ్బకు క్రికెట్‌తో సహా అన్ని క్రీడలు రద్దయ్యాయని, ఇలాంటి సమయంలో ఐసిసి మాత్రం పూర్తి విరుద్ధంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించిందన్నాడు. ఈ పద్ధతి ఏమాత్రం బాగలేదన్నాడు. ఐసిసి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల భారత్ అనూహ్యంగా టెస్టుల్లో టాప్ ర్యాంక్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఐసిసి ఏ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాకు టాప్ ర్యాంక్ కట్టబెట్టిందని గంభీర్ ప్రశ్నించాడు. ఇలాంటి నిర్ణయాలు క్రికెట్ హుందాతనాన్ని దెబ్బతీయడం ఖాయమన్నాడు. ఇప్పటికైనా ఐసిసి ర్యాంకింగ్స్ విధానంపై పునరాలోచన చేయాలని సూచించాడు. క్రికెట్ సిరీస్‌లు ప్రారంభమయ్యే వరకు పాత ర్యాంకింగ్స్‌లనే కొనసాగించాలని కోరాడు. ఐసిసి తీసుకున్న నిర్ణయం తనను ఎంతో ఆవేదన కలిగించిందన్నాడు. భారత్‌తో పోల్చితే ఆస్ట్రేలియా తక్కువ మ్యాచుల్లోనే గెలిచిందని, న్యూజిలాండ్‌తో పోల్చితే ఇంగ్లండ్ సాధించిన విజయాలు చాలా అధికంగా ఉన్నాయన్నాడు. అయినా ఇంగ్లండ్‌ను కాదని కివీస్‌కు, భారత్‌ను తప్పించి ఆస్ట్రేలియాకు అగ్రస్థానాలను కట్టబెట్టడం సమంజసం కాదని గంభీర్ పేర్కొన్నాడు.

Gautam Gambhir Questions to ICC Test Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News