Friday, May 10, 2024

కరోనా కట్టడికి జిహెచ్‌ఎంసి మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -
GHMC Guidelines for Coronavirus
అధికారులు, సిబ్బంది పాటించాలని ఆదేశాలు

హైదరాబాద్: కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రధాన కార్యాలయంలో సందర్శకుల రాకపై నిషేదం విధించిన బల్దియా మరిన్ని చర్యలను చేపట్టింది. ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు కరోనా భారిన పడడంతో అధికారులు, సిబ్బంది పాటించాల్సిన చర్యలపై జిహెచ్‌ఎంసి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలోని అడిషనల్ కమిషనర్లు, ,విభాగాధిపతులు, జోనల్; డిప్యూటి కమిషనర్లను అదేశిస్తూ గురువారం సర్కులర్‌ను జారీ చేశారు.

జిహెచ్‌ఎంసి కార్యాలయాల్లో పాటించాల్సిన మార్గదర్శకాలు 

1. కార్యాలయంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కును ధరించాలి.
2. బహిరంగ ప్రదేశాల్లో కనీసం 2 గజాల దూరాన్ని పాటించాలి.
3. కార్యాలయాలు, సెక్షన్లల్లో సందర్శకులను పూర్తిగా నియంత్రించాలి.
4. భౌతిక దూరాన్ని విధిగా పాటించాలి.
5. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేదం. నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానాలను విధించాలి.
6. కార్యాలయాల ప్రవేశ ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలి
7. సందర్శకులు అధికంగా వచ్చే కార్యాలయాలు, విభాగాలలోని డోర్లు, హ్యాండిళ్లు, రాడ్స్‌లను తరుచుగా శానిటైజేషన్ చేయాలి.
8. ఎస్కిలెటర్లు, లిప్టుల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి మెట్లపై వెళ్లాలి.
9. అత్యవసరం మినహా పైళ్లన్నింటిని ఈఆఫీస్ ద్వారానే పంపించాలి.
10. ఎసిలు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News