Tuesday, April 30, 2024

మెట్రో రైల్ ప్రయాణం సురక్షితం

- Advertisement -
- Advertisement -

Safe is it to travel in metro trains

కేంద్ర,రాష్ట్ర కోవిడ్ మార్గదర్శకాలకు మెట్రో కట్టుబడి ఉంది
కరోనా పెరుగుతున్న సమయంలో ప్రయాణీకులు సహకరించాలి
ప్రయాణికులు మార్గదర్శకాలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు
మాస్కులు, శానిటైజర్ తప్పకుండా వినియోగించాలంటున్న మెట్రో అధికారులు

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకనుగుణంగా తమ ప్రయాణికుల సంక్షేమం, భద్రతకు ఎల్‌అండ్‌టి మెట్రోరైల్ లిమిటెడ్ కట్టుబడి ఉంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపధ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుతం మెట్రో రైల్ ప్రయాణీకుల సహకారం కోరుతుంది. ప్రయాణీకులంతా తప్పనిసరిగా కోవిడ్ భద్రతా మార్గదర్శకాలైనటువంటి భౌతికదూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడం, చేతులకు శానిటైజర్ వినియోగించడం వంటి చర్యలు అందించడ ద్వారా ప్రతి ఒకరికి సురక్షిత ప్రయాణ మార్గంగా మెట్రో ప్రయాణాన్ని మార్చవలసినదిగా మెట్రో ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈమార్గదర్శకాలను ఆచరించడంలో ఏవిధమైన అతిక్రమణలు జరిగిన తగిన రీతిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులకు మొబైల్ క్యుఆర్ టిక్కెట్లను తమ ప్రయాణాలకు ముందుగానే కొనుగోలు చేయాల్సిందిగా ప్రోత్సహిస్తుందన్నారు.

ఫోన్‌పే, మేక్ మై ట్రిప్, పేటిఎం, టీ సవారీ వంటి యాప్‌లను వినియోగించడం ద్వారా ఈటిక్కెటన్లను కొనుగోలు చేయడంతో పాటు సమయం ఆదా చేసుకుంటూనే, సురక్షితంగా ఉండవచ్చన్నారు. అదే సమయంలో కాంటాక్‌లెస్ ప్రయాణాలు చేస్తూనే, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడే బాధను తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. తమ ప్రాంగణాలలో తగిన రీతిలో కోవిడ్ సంబంధిత భద్రతా మార్గదర్శకాలను హైదరాబాద్ మెట్రో రైల్ ప్రదర్శిస్తోందని, ప్రతి సవారీ ఆరంభంలోనే ప్రతి మెట్రో రైల్‌ను శానిటైజ్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేగాకుండా ప్రయాణికులు తరుచుగా తాకే ప్రదేశాలన్నీ కూడా నిర్ధేశిత సమయాల్లో శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు. సాదారణ కోవిడ్ సంబంధిత భద్రతా ప్రకటనలను చేయడంతో పాటుగా ప్రతి మెట్రో ట్రైన్‌లోను ఒక సీటు వదలి ఒక సీటులో కూర్చునేలా సూచికలు అంటించడంతో పాటుగా ప్రయాణికులు భౌతికదూరం ఆచరించేలా ప్లోర్‌పై కూడ గుర్తులను అంటించినట్లు వెల్లడించారు.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News