Sunday, April 28, 2024

దసరాకు ‘ఘోస్ట్’

- Advertisement -
- Advertisement -

కరుణడ చక్రవర్తి డా.శివరాజ్ కుమార్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’తో పాన్ ఇండియా బరిలో దిగనున్నారు. శ్రీని దర్శకత్వంలో నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఘోస్ట్ సినిమా నుండి బిగ్ డాడీ టీజర్‌ను డా. శివరాజ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. శివన్న తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సూపర్ స్వాగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News