Thursday, May 2, 2024

గిఫ్ట్ కార్డ్స్ పేరుతో మోసం… ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Gift card cheating gang arrest in Hyd

హైదరాబాద్: గిఫ్ట్ కార్డ్స్ పేరుతో ఈ కామర్స్ కస్టమర్లను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశామని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 42 మొబైల్ ఫోన్లు, 2 లాప్ ట్యాప్‌లు, డెబిట్ కార్డ్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తరుణ్ కుమార్ గ్యాంగ్ సుమారు రూ.2 కోట్ల వరకు చీట్ చేసిందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఈ ముఠాపై సుమారు మూడు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసులో పది మందిని అరెస్టు చేశామని, వీళ్లు బీహార్, జార్ఖండ్‌కు చెందిన ముఠాగా గుర్తించామని, గిఫ్ట్ కార్డుల మోసం కేసులో మంచిర్యాలకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి న్యాప్‌టాల్, షాప్ క్లూస్ నుంచి వినియోగదారుల డేటా సేకరించామన్నారు. ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేసినందుకు బహుమతి వచ్చిందని చెప్పారని, బహుమతి తీసుకునేందుకు ఫీజు చెల్లించాలని డబ్బులు వసూలు చేశారని బాధితులు చెప్పారన్నారు. వివిధ బాషలు మాట్లాడే వారిని నియమించుకుని మోసాలకు పాల్పడ్డారని, ఈ కేసులో ప్రధాని నిందితులు దూబే, తరుణ్ గుర్తించి అరెస్టు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News