Tuesday, April 30, 2024

ప్రియురాలిని కొట్టి చంపిన బాయ్ ఫ్రెండ్, లవర్

- Advertisement -
- Advertisement -

Girl attacked by exlover-boyfriend dies in hospital

 

బెంగళూరు: బాయ్ ఫ్రెండ్, లవర్ కలిసి ఓ అమ్మాయిని కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన కర్నాటకలోని చిక్కబనవర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దివ్యా అనే విద్యార్థిని బిఇ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె గత నాలుగు సంవత్సరాల బబిత్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. బబిత్ ప్రేమకు గుడ్‌బై చెప్పి రాహుల్‌తో దివ్య స్నేహం చేస్తోంది. ఒక రోజు రాహుల్ ఇంట్లో దివ్య ఉన్నప్పుడు బబిత్ అక్కడికి వచ్చి ఆమెను తిట్టాడు. దీంతో రాహుల్, బబిత్ కలిసి బూతు మాటాలతో ఆమెపై దాడి చేశారు. అనంతరం అమ్మాయి బబిత్ ఇంటికి వెళ్లినప్పుడు అతడు ఆమెను హెల్మెట్‌తో దాడి చేశాడు. దీంతో అక్కడే పడిపోవడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బబిత్, రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతూ మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News