Wednesday, May 22, 2024

అక్రమంగా మద్యం తరలిస్తున్న నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Ramya Krishnan

100బాటిళ్లు సీజ్

మనతెలంగాణ/హైదరాబాద్ : తమిళనాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రముఖ నటి రమ్యకృష్ణకు చెందిన వాహనం మద్యం పట్టుబడింది. ఇన్నో వా వాహనంలో మద్యం తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కారు నుంచి భారీ ఎత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. రమ్యకృష్ణకు చెందిన ఈ వాహనం శుక్రవారం రాత్రి పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం రవాణా చేస్తుండడంతో కారును కూడా సీజ్ చేశా రు. తనిఖీల సమయంలో కారులో 100 కి పైగా బాటిళ్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కనత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, రమ్యకృష్ణ కారు డ్రైవర్ బెయిల్ పై బయటికి వచ్చినట్టు సమాచారం.

96 beer bottles seized from actor Ramya Krishnan’s Car

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News