Tuesday, May 14, 2024

అచ్చెన్నాయుడు లెటర్‌తోనే స్కామ్: ఎసిబి

- Advertisement -
- Advertisement -

ESI Scam: Atchannaidu remanded by ACB

 

అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఎసిబి చేర్చింది. స్కాం మొత్తానికి సూత్రదారి అచ్చెన్నాయుడే అని ఎసిబి తేల్చి చెప్పింది. అచ్చెన్నాయుడు లెటర్‌తోనే స్కామ్‌కు బీజం పడిందని ఎసిబి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే టెలీ హెల్త్ సర్వీస్‌కు రూ.4 కోట్లు రమేశ్ కుమార్ కట్టబెట్టారన్నారు. అచ్చెన్నాయుడు సహాయంతోనే రమేష్ కుమార్ కోట్ల రూపాయలు బదిలీ చేసినట్టు ఎసిబి వెల్లడించింది. ఎటువంటి అనుమతులు లేకుండానే టెలీహెల్త్ సర్వీస్‌కు కోట్ల రూపాయలు బదిలీ చేశారని, ఈ టెండరింగ్ ద్వారా అప్పగించాల్సిన సర్వీసును అచ్చెన్నాయుడు లేఖతో ఇచ్చేశారని అధికారులు తెలిపారు. టెండర్లతో పని లేకుండానే టెలీ హెల్త్‌కు ప్రాజెక్టు అప్పగించారని, పరికరాల కొనుగోళ్లలో కూడా అచ్చెన్నాయుడు పాత్ర ఉందని, డైరెక్టర్ రమేష్ కుమార్‌పై ఒత్తిడి తెచ్చి పరికరాల కొనుగోళ్లు చేశారని, రమేష్-అచ్చెన్న కలిసి ప్రభుత్వానికి గండి కొట్టారని ఎసిబి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News