Monday, April 29, 2024

‘మాస్క్’లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

Telangana Police Special Drive on Corona masks

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నియంత్రిండంలో మాస్క్ ధరించాలన్న నిబంధలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్, భౌతికదూరం పాటించని కార్యాలయాలలో పోలీసులు ఆకస్మిక తనికీలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మాస్క్‌లు, భౌతికదూరం, కార్యాలయాలలో శానిటైజింగ్ లేనిపక్షంలో ఆయా సంస్థల యజమానులు, ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని డిజిపి అన్ని జిల్లాల పోలీసు అధికారులకు ఇచ్చిన ఆదేశాలలో పేర్కొన్నారు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించాలన్న నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలపై నిఘా సారించాలని, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు డిజిపి తెలిపారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌లో కీలకమైన మాస్క్, భౌతికదూరం, శానిటైజింగ్ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థల యాజమాన్యాలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు త్రిముఖ వ్యూ హాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారని, అసలు వ్యా పార, ప్రైవేట్ సంస్థల వారు లాక్‌డౌన్‌ను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?,మాస్క్, భౌతికదూరం పట్ల ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారన్న అంశాలపై నిఘా సారించనునానరు. లాక్‌డౌన్‌ను పాటించాలని ఓవైపు ప్రభుత్వం, మరోవైపు అధికారులు ఎంత చెబుతున్నా నిబంధనలు పాటించని వారిపట్ల ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

కరోనాకేసులు నానాటికి అధికమౌతున్న కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ సంస్థలపై, మార్కెట్లపై ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశామని, నిబంధనలు పాటించని వారిపై అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం కేసులు నమోదు చేయాలని రాచకొండ, సైబరాబాద్, నగర పోలీసు కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు మాస్క్ లు ధరించడాన్ని తప్పనిసరి చేశారని, ఈ మేరకు భౌతిక దూరం సైతం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డిజిపి తెలిపారు. ఇకపై ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు తిరిగి ఇంటికి చేరుకునే వరకు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు.

Telangana Police Special Drive on Corona masks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News