Monday, May 6, 2024

యేసు, ఏడుకొండల వెంకన్న చెప్పినా జగన్ వినడు… ఆ ఒక్కరు చెబితే వింటాడు…

- Advertisement -
- Advertisement -

I am not Went to Parliament by JC Diwakar reddy

 

అమరావతి: జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి అరెస్టులపై తాను ఏమీ మాట్లాడబోనని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానానికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారు. సిఎం జగన్ కు యేసు ప్రభువు, తిరుమల వెంకన్న దేవుడు చెప్పిన వినరని, ఆయనను ఆపే శక్తి పిఎం మోడీకి మాత్రమే ఉందన్నారు. తనని అరెస్టు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఎవరు లేకుండా, తనకు ఎదురు చెప్పేవాడే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. అనంతపురం పోలీస్ స్టేషన్‌లో జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు జెసి అనుచరులు ఆందోళన చేపట్టారు. జెసి అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెసి దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చి మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టులు చేశారని మండిపడ్డారు. బిఎస్-3 వాహనాలను బిఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు చేయడంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్టు సమాచారం. నకిలీ ఎన్‌ఒసి, నకిలీ ఇన్సూరెన్స్‌ల డాక్యుమెంట్లు వారి దగ్గర ఉండడంతో అరెస్టు చేసినట్టు సమాచారం. జెసి ట్రావెల్స్‌పై అనంతపురం, తాడిపత్రి ప్రాంతాలలో 27 కేసులున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News