Sunday, April 28, 2024

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

గద్వాల: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కేటిదొడ్డి మండలం పూజారీ తాండలలో తెలంగాణ గిరిజన సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు లాంబాడీ నృత్యాలతో స్థానిక ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రూ.20లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

పూజారి తండాలలో సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి రూ.లక్షఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న తండాలను, ఆదివాసీ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేశారని తెలిపారు. గిరిజనుల గృహావసరాల కోసం 101 యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య అందించడానికి ఎస్‌టీ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాతనే సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్నామని అన్నారు.

త్వరలోనే రాష్ట్రంలోని గిరిజన,ఆదివాసి రైతులకు నాలుగు లక్షలకు ఎకరాల పైగా పోడుభూములకు చెందిన పట్టాలను ప్రభుత్వం అందించనున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కేటిదొడ్డి ఎంపీపీ మనోరమ్మ, జడ్పిటిసి రాజశేఖర్, వైస్‌ఎంపిపి రామకృష్ణనాయుడు, గ్రామ సర్పంచు జమున, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్‌గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీడీఓ, ఎంపీఓ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News