Tuesday, May 7, 2024

మన ఊరు- మన బడితో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలు ఆధునిక హంగులతో సమూల మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ పట్టణంలోని వడ్డెరవాడ యూపిఎస్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రూ.7.90లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యారంగం ప్రగతిబాటలో నడుస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ కొత్త గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్యారంగానికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్షానికి గురైన సర్కారు విద్యకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్‌ఛైర్మన్ రహత్‌అలి, ఎంపీడీవో శర్మ, ఎంఈవో మాతృనాయక్, కమిషనర్ వెంకటయ్య, జయప్రకాశ్‌నారాయణ, పాఠశాల హెచ్‌ఎం పొట్ట ప్రేమయ్య, ఏఈ లష్కర్, తౌఫిక్, చిత్రం పదీప్, ఇలియాస్, బొడ్డుపల్లి కృష్ణ, అప్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News