Sunday, May 5, 2024

ముంపు ప్రాంతల్లో పర్యటించిన గవర్నర్ తమిళసై

- Advertisement -
- Advertisement -

సుబేదారి: వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్సాలకు దెబ్బతిన్న ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్, డాక్టర్ సౌందర్య రాజన్ బుధవారం ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ జవహర్ నగర్, నయీం నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్‌ఎన్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్‌నగర్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ డాక్టర్ తమిళ సౌందర్య రాజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురిసిన భారీ వర్సాలకు వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చేపట్టాలని స్థానిక్ రెడ్‌క్రాస్ సొసైటీ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియచేశామన్నారు.

ఇది చాలా దురదృష్టకరం అనేక ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వెంటనే పునరుద్దరించడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. అయితే భారీ వర్షాలకు ముంపుకు గురికాకుండా ఈ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానిక తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచించినట్లు ఆమె అన్నారు.

వరదలు వచ్చినపుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహారం అందించడానికి రెడ్‌క్రాస్ సొసైటీ స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నట్లు గవర్నర్ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బృందం పరిశీలించినట్లు ఆమె తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, వరంగల్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News