Friday, May 3, 2024

సైబర్‌ సెక్యూరిటీపై సమీక్ష

- Advertisement -
- Advertisement -

 యూకో బ్యాంక్ మోసం నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
వచ్చేవారం బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమావేశం

న్యూఢిల్లీ : కోల్‌కతాకు చెందిన యుకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల మోసం వెలుగుచూసింది. ఈ కేసులో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై వచ్చే వారం ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమావేశం కానుంది. డిజిటల్ సిస్టమ్‌లు, సైబర్‌సెక్యూరిటీకి సంబంధించిన చర్యల సమీక్ష, ఇతర అంశాలపై వచ్చే వారం సమావేశంలో ప్రభుత్వం బ్యాంకులకు సూచనలు చేసే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వరంగ యూకో బ్యాంక్‌లో గత వారం సాంకేతిక సమస్య తలెత్తిన తర్వాత ఆర్థిక సేవల్లో వేగంగా పెరుగుతున్న డిజిటల్ వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.

యూకో బ్యాంక్‌లోని తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపిఎస్) ద్వారా గత వారం రూ.820 కోట్లు కొందరి ఖాతాలకు తప్పుగా బదిలీ అయ్యాయి. రూ.820 కోట్లలో రూ.649 కోట్లను రికవరీ చేయగలిగామని యూకో బ్యాంక్ తెలిపింది. ఇది తప్పుగా పంపిన మొత్తంలో దాదాపు 79 శాతం ఉంటుంది. అయితే, ఈ సాంకేతిక లోపం మానవ తప్పిదం వల్ల జరిగిందా? లేదా ’హ్యాకింగ్’ ప్రయత్నాల వల్ల జరిగిందా? అనేది యుకో బ్యాంక్ ఇంకా స్పష్టం చేయలేదు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ దీనిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ బ్యాంకులకు కీలక సూచనలు చేసింది. బ్యాంకులు భవిష్యత్తులో సైబర్ ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News