Sunday, April 28, 2024

పన్నుపాలన సరళతరం

- Advertisement -
- Advertisement -

Nirmala

టాక్స్‌పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్‌పేయర్ చార్టర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్ 2020లో ప్రకటించిన ఉద్దేశం కూడా ఇదేనని అన్నారు. పరిశ్రమ ప్రతినిధులు, ఆర్థికవేత్తలతో భేటీ నేపథ్యంలో సీతారామన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పౌరుల్లో నమ్మకం నింపేందుకే పన్ను పాలనను సులభతరం చేయనున్నామని, టాక్స్‌పేయర్స్ చార్టర్ నమ్మకాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. టాక్స్‌పేయర్స్ చార్టర్‌తో చెల్లింపుదారులకు పూర్తి ప్రక్రియను సులభతరం అవుతుందని, వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుందని మంత్రి అన్నారు.

పన్ను చెల్లింపుదారులు, అధికార యంత్రాగం మధ్య నమ్మకాన్ని పెంచి, అలాగే వేధింపులను తగ్గించేందుకు టాక్స్‌పేయర్స్ చార్టర్‌ను సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) అమలు చేయనుందని గత శనివారం బడ్జెట్ సందర్భంగా సీతారామన్ చెప్పారు. ఈ చార్టర్ పన్ను చెల్లింపుదారుల హక్కులు, పన్ను విభాగం బాధ్యతలను వివరిస్తుంది. దీర్ఘకాలిక, స్వల్పకాలి ప్రయోజనాల దృష్టితో మౌలికసదుపాయల సృష్టి ఉంటుందని, ఈ దిశగా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని ఆమె అన్నారు.

వాస్తవంగా రాష్ట్రాలు, ప్రైవేటు పెట్టుబడిదారులతో తమకు పని ఉంటుందని, 6400 పైగా మౌలిక సదుపాయ ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ఉద్దేశం రిటైల్ ఇన్వెస్టర్లను కూడా ఈ విభాగంలోకి తీసుకురావడమేనని మంత్రి తెలిపారు. ఆదాయ పన్ను వసూళ్లలో కొతర కారణంగా ప్రభుత్వానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవడమే ఎల్‌ఐసి లిస్టింగ్ లక్షమని అన్నారు. దీంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందివ్వడంతోపాటు స్టార్టప్‌లకు పన్ను భారం తగ్గించే చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.

ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు వర్క్ నడుస్తోంది..

వివాదాస్పద ఎఫ్‌ఆర్‌డిఐ(ఫైనాన్షియల్ రిసొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) బిల్లుపై ఆర్థిక మంత్రిత్వశాఖ పనిచేస్తోందని, పార్లమెంట్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నామనేది ఖచ్చితంగా చెప్పలేమని సీతారామన్ అన్నారు. డిపాజిట్ బీమా ఐదు రెట్లు పెంచడం, ఇటీవల దివాలా చట్టంలో మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Govt intends to have simplified income tax regime

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News