Wednesday, May 15, 2024

బుద్ధ వనంలో ఘనంగా బుద్ధ దాతువుల ప్రతిష్టాపన

- Advertisement -
- Advertisement -

 ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ , నాగార్జున సాగర్ : తెలంగాణ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధ వనంలో పూజ్య బిక్షువు డాక్టర్ అజాన్ విసియన్ నేతృత్వంలో బుద్ధుని పరమ పవిత్రమైన దాతువుల ప్రతిష్టాపన ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించినట్లు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షులు గగన్ మాలిక్, ఇండోనేషియా కు చెందిన బున్టారియా టిగ్రీస్ , శీలా కుమార కోసన్, మిలియాన్ చంద్ర యానిలిం ల ద్వారా సేకరించిన బుద్ధుని అరహతుల దాతువులను ప్రత్యేకంగా అలంకరించిన పగోడాలో నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం ఎంట్రెన్స్ ప్లాజా వద్ద మల్లేపల్లి లక్ష్మయ్యకు అందించారు.

మేళతాళాలతో కోలాటాలతో బౌద్ధ భిక్షువులు ముందుకు సాగగా ఊరేగింపుతో బుద్ధ ధాతువులను మహా స్తూపం అంతర్భాగంలోని మహాయాన బౌద్ధ సంప్రదాయం ప్రకారం దాతు పూజ, బౌద్ధ ప్రార్ధనలతో ఆనంద ఉత్సవాలతో ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. బుద్ధ ధాతువు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుద్ధునికి చెందిన ఆరు శారీరక ధాతువులతో పాటు గౌతమ బుద్ధుని అనుచరులైన సారీ పుత్ర, మొగ్గలాన , శివాలీ, అనిరుద్ధ, బకుల, ఉపాలి, ఆనంద , మయన్మార్‌కు చెందిన దగోన్ అనే అరహతుల దాతువులను కూడా నిక్షిప్తం చేయడం జరిగిందన్నారు. అత్యంత బౌద్ధ భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ప్రతిష్ట ఉత్సవంలో బాలీవుడ్ నటుడు జగన్ మాలిక్ ,ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజశేఖర టoడ్రు, నల్లగొండ కలెక్టర్ కర్ణన్, మహా బోధి బుద్ధ విహార కు చెందిన సంఘ పాలబిక్కు, ఇండోనేషియాకు చెందిన డిప్రిబాయ్, ఎడిజహాన్ ,ఐరవెంటో హర్ట్‌oటూ, యూనిలిం, మిలియానియా చంద్ర, ఎలైన్ ఓయూ, ఇంగ్రిడ సేటియాడి, లిడియా సూపర్మన్, లెన్ని , మొనీహు, టాన్జాయింగ్, విన్నా చంద్ర, దన్ కాంగ్హా, జర్మనీకి చెందిన వాలంటీన్లే, మైంపులే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బుద్ధవనం విషయ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కేకే రాజా, కొండా లక్ష్మీకాంతరెడ్డి, సబ్బతి విష్ణుమూర్తి, భారతీయ బౌద్ధ సంఘం అధ్యక్షులు పరంధాములు, విజయవాడ బుద్ధ విహార కార్యదర్శి శుభాకార్ మేడసాని, బుద్ధవనం ఓఎస్డి సుధన్ రెడ్డి, శ్యాంసుందర్రావు , డిఈలు దామోదర్ రెడ్డి, ,శ్రీనివాస్ రెడ్డి , ఏఈ నాజీజ్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News