Tuesday, May 7, 2024

మనీష్ శిశోడియాకు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మద్యం పాలసీ కుంభకోణం సందర్భంగా జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ శిశోడియాకు మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీలో ఒక కోర్టు సోమవారం మంజూరు చేసింది. లక్నోలో తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు శిశోడియా సోమవారం నుంచి శుక్రవారం (16) వరకు మధ్యంతర బెయిల్ కోరారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసులలో శిశోడియాకు మంగళవారం నుంచి గురువారం (15) వరకు మధ్యంతర బెయిల్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ మంజూరు చేశారు. అవినీతి కేసును సిబిఐ, మనీ లాండరింగ్ కేసును ఇడి దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి శిశోడియా బెయిల్‌కు సిబిఐ న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

‘ఉన్నతమైన, శక్తిమంతమైన పదవి’ నిర్వహించిన ‘అత్యంత ప్రభావశీలి’ శిశోడియా అని, ఆయన ‘సాక్షాధారాలను నాశనం చేయగలరు’ అని సిబిఐ న్యాయవాది అన్నారు. వధూవరులు మాత్రమే తమ వివాహానికి ఐదు రోజుల సెలవు కోరవచ్చునని, వివాహానికి హాజరు కావడానికి ఒక రోజు బెయిల్ మంజూరు చేయవచ్చునని సిబిఐ సూచించింది. పెళ్లి వేడుకలో పోలీస్ అధికారులు ఉంటే శిశోడియాకు ఫర్వాలేదా అని ఆయన న్యాయవాదిని కోర్టు అడిగింది. ‘వద్దు. అది వాతావరణాన్ని పాడు చేస్తుంది. నాకు మూడు రోజులే లభించినా ఫర్వాలేదు. కానీ నాతో పాటు పోలీసులు రారాదు’ అని శిశోడియా తన న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News