Monday, April 29, 2024

కెఆర్‌ఎంబిని కేంద్రానికి అప్పగించం

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు
రాయలసీమ లిఫ్ట్ ఇరేగేషన్‌కు రోజుకు 3 టిఎంసిల తరలిపు
50 శాతం నీటి ఏపి అక్రమంగా తన్నుకు పోయింది
తెలంగాణ నీటి పారుదలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చింది. కృష్ణ ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భం ఆయన అసెంబ్లిలో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ పై పోలీసులను పంపిందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని, నీటి వాటాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజానాలను కాపాడడంలో బిఆర్‌ఎస్ విఫలమైందని విమర్శించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి అపోహలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రోజుకు 3 టిఎంసి అక్రమంగా తరలింపు…
దేశంలో గంగా నది, గోదావరి తర్వాత కృష్ణ నది పెద్దదని వివరించారు. ఈ నది తెలంగాణలో నారాయణ పేట జిల్లాలోని తంగిడిలో కృష్ణా నది ప్రవేశిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.గత పదేళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అన్యాయం జరిగిందని వివరించారు. నదుల విషయంలో గతంలో అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగలేదన్నారు. పొతిరెడ్డిపాడు సామర్ధాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 92 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ జీవో 203 ఇచ్చి.. జగన్ ప్రభుత్వం పెంచిందని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో 3 టిఎంసి రోజుకు అక్రమంగా తరలించారని ఆయన ఆరోపించారు.తెలంగాణకు గ్రావిటి ద్వారా రావాల్సిన నీరు అక్రమంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు సైలెంట్ అప్రూవల్తో ఏపీ మార్చుకున్నదని ఆరోపించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం మొదలైందన్నారు. కేసీ కెనాల్‌కు 1000 క్యూసెక్కులు, మల్యాల దగ్గర 6,300కు పెంచారన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతానికంటే కృష్ణా నదీ జలాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు.
50 శాతం ఎక్కువ వాటర్ ఆంధ్ర తీసుకపోయారు…
2004 నుంచి 2014 వరకు అక్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ 10,655 టిఎంసిలు వస్తే.. 727 టిఎంసిలు ఔట్ సైడ్ డైవర్ట్ అయ్యాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 24 వరకు శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 8,993 టిఎంసింటే 1200 టిఎంసిలు డైవర్ట్ అయ్యాయని ఆరోపించారు. గత పదేళ్ల కంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 శాతం ఎక్కువ వాటర్ ఆంధ్రవాళ్లు తీసుకుపోయారన్నారు. దీంతో తెడిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు 225 టిఎంసికి వాటర్ క్లైం చేయలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి స్కీం ముందు 2 టిఎంసి అని జీవో ఇచ్చి 1 టిఎంసి చేశారన్నారు. 27,560 కోట్లు ఖర్చుపెట్టి.. ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదన్నారు. మరి కృష్ణా నదీ జలాలపై మరి నల్గొండలో సభలు పెట్టుకున్న ఏమీ ప్రయోజనమని మంత్రి విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలం …
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే ప్రసక్తే లేదని.. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది.గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ‘ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకు పోలీసులను పంపింది. రోజుకు 3 టిఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు.
కెసిఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు..
బచావత్ ట్రైబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కారు విఫలమైంది. భారాస పాలకులది అసమర్ధతో.. అవగాహనా లోపమో అర్ధంకాదు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిల్లీ వెళ్లి 512:299 టిఎంసిలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపి ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల భారాస పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు. జగన్, కేసీఆర్ గంటలతరబడి మాట్లాడుకున్నారు.. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారు.
కావాలనే అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేసీఆర్ వెళ్లలేదు..
రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుంది. ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయిన తర్వాత కెసిఆర్ కేంద్రానికి లేఖ రాసి పరోక్షంగా సహకరించారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.కావాలనే ఆయన అపెక్స్ కౌన్సిల్ భేటీకి కెసిఆర్ హాజరుకాలేదని, సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఉత్తమ్ 2013లోనే ప్రాజెక్టు మొదలైన ఇప్పటకి పనులు పూర్తి చేయలేదన్నారు.కాంగ్రేస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయం తీసుకోలేదు. నల్గొండలో సభ నిర్వహించే ముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుక తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News