Friday, May 3, 2024

బిసిలను అవమాన పర్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది

- Advertisement -
- Advertisement -

నెహ్రూ కాలం నుంచి ఏనాడు బిసి సమస్యలను ఆపార్టీ పట్టించుకోలేదు
ముగ్గురు పెద్దలకు భారతరత్న ఇవ్వడంపై హస్తం నేతలు జీర్ణించులేకపోతున్నారు: ఎంపి లక్ష్మణ్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓబిసి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారని, బిసిల ప్రయోజనాలను నెహ్రూ కుటుంబం అణచివేసిందని మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్‌ను అవమానించిన ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం కాంగ్రెస్ ఆరాట పడుతుందన్నారు. మోడీని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, కర్పూరీ ఠాకూర్, చరణ్ సింగ్, పివి. నరసింహా రావుకు భారత రత్న ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.

రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించిందో చెప్పలేదని, హిందువులను ఆ పార్టీ అవమానించిందన్నారు. హిందువులను, దేవి దేవతలను అవమానించడమే సెక్యులరిజం అని ఆ పార్టీ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ అసలైన మతతత్వ వాది అని, హిందుత్వం కోసం పనిచేస్తున్న ఏ వర్గాలను మోడీ ప్రభుత్వం విస్మరించలేదన్నారు. బిఆర్‌ఎస్ కేశవ రావు కూడా అయోధ్య రామ మందిరంపై పార్లమెంట్‌లో చర్చిస్తే తప్పు పడుతున్నారన్నారు. వీళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందని, రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఆరోపించారు. రాముడు మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందనీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారన్నారు. బిజెపి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News