Wednesday, May 1, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శం : మహేష్ బిగాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాలలో విస్తరించింది , బిఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, చాలా మంది రాజకీయ నాయకులు సంక్షేమం, అభివృద్ధి , ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెడతారు. అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత మిన్న అని, సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని పేర్కొన్నారు.

మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. అందుకు ఉదాహరణగా జాన్ కెర్రీ (మాజీ రాష్ట్రపతి అభ్యర్థి) వాతావరణ మార్పు కోసం యుఎస్ ప్రత్యేక అధ్యక్ష ప్రతినిధిగా నియమించబడ్డారు అంటే పర్యావరణ పరిరక్షణ ఎంత గొప్పదో అర్ధమవు తుందన్నారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (హరితహారం) ప్రచారంలో ప్రత్యేక ప్రతినిధి కావడం విశేషం. కెసిఆర్ పేరు భవిష్యత్‌తరాలకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన చేసిన కృషికి సంతోష్ జోగినపల్లికి అందరి ఎన్నారైల తరపున శుభాకాం క్షలు తెలిపారు అలాగే సమిష్టి కృషి, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చోటు లభించడం హర్షణీయం అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News