Monday, August 11, 2025

అర్లి వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భైంసా : గత కొన్ని రోజలుగా ఎదురుచూస్తున్న అర్లి వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యే రామరావు పటేల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో నెం. 389 ద్వారా ఆర్ అండ్ బీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి సైతం నిధులు మంజూరయ్యాయన్నారు. అర్లి బ్రిడ్జితో పాటు కిష్టాపూర్ మీదుగా లోకేశ్వరం వరకు రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా భైంసా నుండి నయా గొడిసెరా, కుభీర్, పార్డి (కే), పల్సి, సిర్పెల్లి వరకు 27 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం చేపడుతామని, ముథోల్ నుండి నయాసింగన్‌గావ్, తానూర్, జౌల (కె) వడ్‌గాం మార్గం గుండా మహారాష్ట్ర సరిహద్దు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News