Friday, May 3, 2024

సైనాపై జ్వాల వివాదాస్పద ట్వీట్…

- Advertisement -
- Advertisement -

Jwala-Gutta

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరడంపై బ్యాడ్మింటన్‌కు చెందిన మరో స్టార్, ఫైర్‌బ్రాండ్ గుత్తా జ్వాల వివాదాస్పద చేసింది. సైనా బుధవారం రాజధాని ఢిల్లీ వేదికగా బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. సైనా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ గుత్తా అనుచిత వ్యాఖ్యలకు దిగింది. అర్థం పర్థంలేని పార్టీలో చేరావంటూ ట్వీటర్‌లో సైనాను ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఏ లక్షం లేకుండానే ఆట మొదలుపెట్టావు..ఇప్పుడూ ఏ కారణం లేకుండానే బిజెపిలో చేరావు.. ఇలాంటి వారి గురించి తొలిసారి వింటున్నా.. అని సైనాను ఉద్దేశించి జ్వాల ట్వీట్ చేసింది. కాగా, గుత్తా చేసిన ఈ ట్వీట్‌పై పెద్ద దుమారమే చెలరేగింది.

ఇది వివాదాస్పదంగా మారడంతో జ్వాల తన ట్వీట్‌ను తొలగించింది. అయితే అప్పటికే అది వైరల్‌గా మారడంతో గుత్తాపై సైనా అభిమానులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జ్వాల వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జ్వాల వివాహ జీవితం, ఆమె ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సైనా అభిమానులు కూడా వివాదాస్పద ఆరోపణలకు దిగారు. దీంతో సైనాజ్వాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చాలా మంది నెటిజన్లు జ్వాలను తప్పుపడుతున్నారు. సహచర క్రీడాకారిణిపై ఇంత ద్వేషం ఎందుకు అంటూ జ్వాలను ప్రశ్నిస్తున్నారు. అసాధారణ ఆటతో ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్రను వేసిన సైనా అంటే జ్వాలకు ఎంతో అసూయ అని వారు మండిపడుతున్నారు.

ఆటకంటే ఇతర విషయాలతోనే జ్వాల వార్తల్లో నానుతుందని, అదే సైనా తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీలో చేరాలి..ఎలాంటి జీవితం గడపాలి అనే దానిపై తగు నిర్ణయం తీసుకునే హక్కు సైనాకు ఉందని, ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టే అర్హత జ్వాలకు లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ముందు నుంచై సైనా అంటే జ్వాలకు పడదని, ఈ విషయం మరోసారి స్పష్టమైందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. బిజెపిలో చేరడం సైనా వ్యక్తిగత నిర్ణయమని దీనిపై రాద్దాంతం చేసే హక్కు జ్వాలకు లేదని మరో నెటిజన్ పేర్కొంది. హుందగా ఉండడం జ్వాలకు రాదని, ఇతరులపై తన అక్కసును వెళ్లగక్కడం ఆమె అలవాటుగా మార్చుకుందని మరోకరూ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా జ్వాల ట్వీట్‌పై మాత్రం సైనా నెహ్వాల్ ఇంత వరకు స్పందించలేదు.

Gutta Jwala Tweet on Saina Nehwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News